గత ఐదేళ్ళలో.. ఎన్‌ఆర్‌ఐ భర్తలపై ఆరువేల ఫిర్యాదులు!

| Edited By: Srinu

Nov 21, 2019 | 1:21 PM

విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలకు భద్రత కల్పించే విధంగా అప్పటి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విదేశాల్లోని భారతీయ మహిళలు గృహహింస, వరకట్న వేధింపులకు గురవుతే.. భర్తలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత గత నెల వరకు భారీగా ఫిర్యాదులు అందినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. గత నాలుగేళ్లలో.. 2015 నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు ఆరువేలకు పైగా ఫిర్యాదులు అందాయి. […]

గత ఐదేళ్ళలో.. ఎన్‌ఆర్‌ఐ భర్తలపై ఆరువేల ఫిర్యాదులు!
Follow us on

విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలకు భద్రత కల్పించే విధంగా అప్పటి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విదేశాల్లోని భారతీయ మహిళలు గృహహింస, వరకట్న వేధింపులకు గురవుతే.. భర్తలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత గత నెల వరకు భారీగా ఫిర్యాదులు అందినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. గత నాలుగేళ్లలో.. 2015 నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు ఆరువేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది అక్టోబరు చివరి నాటికి 991 ఫిర్యాదులు వచ్చాయి. 2018లో 1,299కేసులు నమోదైయ్యాయి. 2017లో 1,498 ఫిర్యాదులు, 2016లో 1,510, 2015లో 796 ఫిర్యాదులు అందాయని విదేశాంగశాఖ వెల్లడించింది.