
నిజాం నిధులకు సంబంధించిన కేసులో పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. నిజాం రాజు నిధులు మొత్తం భారత్, నిజాం వారసులకే చెందుతాయని యూకే కోర్టు 80 ఏళ్ల తరువాత తీర్పు వెలువరించింది. దేశవిభజన సమయంలో పాకిస్తాన్‌తో చేతులు కలిపిన నిజాం రాజు పాకిస్తాన్ హైకమినర్ పేరిట లండన్‌లోని నాట్‌వెస్ట్ లండన్‌లో పాకిస్తాన్ హై కమిషనర్ ఖాతాలో రూ.10 లక్షల పౌండ్లు బదిలీ చేసాడు. అదే సమయంలో ఆపరేషన్ పోలో పూర్తికావడం, నిజాం లొంగిపోవడంతో ఆ నిధులను వెనక్కి ఇచ్చేందుకు పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దీంతో నిజాం వారసులు యూకే కోర్టును ఆశ్రయించారు. ఆ నిధులను తమకే చెందుతాయని, వీలైనంత త్వరగా అప్పగించాలని కోరారు.
అయితే, ఆయుధాల కొనుగోలు కోసం నిజాం రాజు మాకు ఇచ్చిన నిధులను తిరిగి చెల్లించేందుకు వీలు పడదని పాకిస్తాన్ వాదించింది. 80 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం బుధవారం యూకే కోర్టు తీర్పు వెలువరించింది. ఆ నిధులతో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, వాటిపై సర్వహక్కులు భారత్, నిజాం వారసులకు చెందుతాయని స్పష్టం చేసింది. దీనిపై నిజాం ఇద్దరు కుమారులు ముఖరం ఝా, ముఫఖ్కం జా హర్షం వ్యక్తం చేసారు.
నిజాం సంపదను పంచుకోనున్న 120 మంది:
డెబ్బై సంవత్సరాల న్యాయపోరాటం తర్వాత నిజాం నవాబుకు చెందిన సుమారు మూడు వందల కోట్ల రుపాయాలను ఆయన వారసులతో పాటు, భారత ప్రభుత్వం హక్కుదారు అనే తీర్పును లండన్ కోర్టు వెలువరించిన నేపథ్యంలోనే సంపద పంపీణిపై ఆసక్తి నెలకోంది. ఈనేపథ్యంలోనే నిజాం డబ్బును ఆయన వారసులతో పాటు కేసులో ప్రతివాదులుగా చేరిన మొత్తం 120 మంది పంచుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాంకులో దాచిన డబ్బుకోసం నిజాం మనుమలు అయిన ముకరం జా, ముఫఖ్కం జాలు ముందుగా భారత ప్రభుత్వంతో కలిసి న్యాయపోరాటం చేశారు. అనంతరం నిజాం సంపద తమకు కూడ దక్కుతుందంటూ కొంతమంది నిజాం ఎస్టెట్‌గా ఏర్పడి కేసులో ఇంప్లీడ్ అయ్యారు. దీంతో ఆ మొత్తాన్ని వారే పంచుకుంటారనే వార్తలు వెలువడుతున్నాయి.
అయితే తీర్పు ప్రకారం భారత ప్రభుత్వం కూడ సంపదలో వాటాదారుగా ఉంటుంది. కాని గవర్నమెంట్ నిజాంకు చెందిన సంపదకన్నా.. దేశ ప్రతిష్టకోసమే దీనిపై న్యాయస్థానంలో పోరాడినట్టు తెలుస్తోంది. ఇందుకోసమే కేసులో విజయం సాధించడం కోసం హరీష్ సాల్వే లాంటీ ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దింపినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిజాం సంపదను భారత ప్రభుత్వం తీసుకునేందుకు అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.