ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలపై..గంగూళి గరంగరం!

పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై.. టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం పూర్తిగా అర్థరహితమైనదని టీమిండియా గంగూలీ దుయ్యబట్టారు. ఒక క్రికెటర్‌గా ఇమ్రాన్ ఖాన్ అంటే ఏంటో ప్రపంచానికి తెలుసని, కానీ యూఎన్ జనరల్ […]

ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలపై..గంగూళి గరంగరం!
Follow us

|

Updated on: Oct 05, 2019 | 11:37 AM

పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై.. టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం పూర్తిగా అర్థరహితమైనదని టీమిండియా గంగూలీ దుయ్యబట్టారు. ఒక క్రికెటర్‌గా ఇమ్రాన్ ఖాన్ అంటే ఏంటో ప్రపంచానికి తెలుసని, కానీ యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా ఇమ్రాన్ చేసిన ప్రసంగం ద్వారా పూర్తిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారని గంగూలీ విమర్శించారు. అంతేకాదు తాను వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం గురించి విశ్లేషించుకున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కున్నారు. ఇప్పటికైనా పాక్ ప్రధాని దేశం గురించి.. ప్రజల గురించి ఆలోచించాలని దాదా హితవు పలికారు. అంతేకాదు ప్రపంచమంతా శాంతి కోసం ఎదురుచూస్తోంది, ముఖ్యంగా పాకిస్థాన్ లాంటి దేశానికి శాంతి చాలా అవసరం, వీటన్నింటి దృష్ట్యా ఇమ్రాన్ పరిణితి లేని ప్రసంగం విమర్శల పాలైందని సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కాగా ఆర్టికల్ 370 రద్దుపై యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ పై తీవ్ర విమర్శలు చేయడంతో..అతడిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.