ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్… ఆన్‌లైన్‌లో దూర విద్య తరగతులు

|

Sep 11, 2020 | 12:10 PM

కరోనా ప్రభావంతో అన్ని చదువులు ఇంటి నుంచే సాగుతున్నాయి. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూర విద్య కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ఇక్కడ నిర్వహించే కోర్సులను తర్వలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని వర్శిటీ అధికారులు నిర్ణయించారు...

ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఆన్‌లైన్‌లో దూర విద్య తరగతులు
Follow us on

Osmania University Distance Education  : కరోనా ప్రభావంతో అన్ని చదువులు ఇంటి నుంచే సాగుతున్నాయి. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూర విద్య కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ఇక్కడ నిర్వహించే కోర్సులను తర్వలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని వర్శిటీ అధికారులు నిర్ణయించారు. 2021 జనవరి వరకు ఇదే పద్దతిలో చదువులు కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నారు వర్సిటీ అధికారులు. తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ కోర్సులను తీసుకొస్తున్నారు. పనిచేసుకుంటూ దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు చదివి సర్టిఫికెట్లు అందుకోవాలనుకునే విద్యార్థులకు ఆన్‌లైన్‌ కోర్సులు దోహదపడనున్నాయి.

దేశంలోని 100లోపు ర్యాంకు గల యూనివర్సిటీలు దూరవిద్యలో ఆన్‌లైన్‌లో కోర్సులు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఆదేశించింది. దీంతో ఉస్మానియా వర్సిటీలో ఆన్‌లైన్‌ కోర్సుల కోసం ఓ కమిటీ ఏర్పాటు  చేస్తున్నారు. వర్సిటీ 80వ స్నాతకోత్సవం సందర్భంగా అప్పటి వీసీ దూరవిద్యలో ఆన్‌లైన్‌ కోర్సులను తీసుకురానున్నట్లు ప్రకటించారు. తొలుత పీజీ డిప్లొమా ఇన్‌ డేటాసైన్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ ఇన్‌ లాకు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. కొవిడ్‌ తదితర పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పీజీ డిప్లొమా ఇన్‌ డేటాసైన్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, పీజీ డిప్లొమా ఇన్‌ మేథమెటిక్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫెషనల్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.