వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఇప్పుడు ఆంటిగ్వా, డొమినికాల మధ్య ‘కొరకరాని కొయ్య’లా మారాడు. అతడిని ఇండియాకు అప్పగించరాదని ఆంటీగ్వాలోని ప్రతిపక్ష నేత ఒకరు పట్టుబడుతున్నారు. మన దేశ చట్టాల ప్రకారం ఆయనను భారత్ కు ఇప్పుడే అప్పగించరాదని యునైటెడ్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత,మాజీ మంత్రి కూడా అయిన హెరాల్డ్ లోవెల్ కోరుతున్నారు. ఈ దేశ చట్టాల ప్రకారం ఈ దేశ పౌరులను ఇతర దేశాలకు అప్పగించరాదన్నారు. ఇంతే గానీ డొమినికా అప్పగిస్తే తమకు అభ్యంతరం కేదన్నారు. నేను ఆయన తరఫున మాట్లాడడంలేదు.. కానీ ఈ దేశ పౌరుడిగా ఆయనకు కొన్ని హక్కులున్నాయి అని లోవెల్ వ్యాఖ్యానించారు. చోక్సీ పై కేసులున్నాయని, వాటి విచారణ ఇక్కడే జరగాలని అన్నారు. కోర్టు నిర్ణయం ప్రకారం ఆయనను అప్పగించవచ్చునని, అసలు ఇండియా తన అభ్యర్థనను వాయిదా వేయాలని దాదాపు డిమాండ్ చేశారు. చోక్సీ అక్రమంగా డొమినికాలో ప్రవేశించినందుకు అతడిని అరెస్టు చేయడమే కాక నేరుగా ఇండియాకు పంపించివేయాలంటూ తమ దేశ ప్రధాని గెస్టన్ బ్రౌన్ వ్యాఖానించడాన్ని లోవెల్ తప్పు పట్టారు. ఇది సరైన ప్రొసీజర్ కాదని, అసలు ఆయన బహుశా డొమినికాకు బోటులో వెళ్లి ఉండకపోవచ్చునని, ఆ రిపబ్లిక్ పోలీసులే అడ్డగించి అరెస్టు చేసి ఉండవచ్చునని లోవెల్ అభిప్రాయపడ్డారు.
ఇన్వెస్టిగేషన్ జరపకుండానే ఆయన విషయంలో అంతా కవరప్ చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా లోవెల్ వ్యాఖ్యలను ఇండియాలోని చోక్సీ తరఫు లాయర్ విజయ్ అగర్వాల్ స్వాగతించారు. తమ క్లయింటు విషయంలో లోవెల్సరైన రీతిలోనే మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. మా క్లయింటు ఎక్కడపడితే అక్కడ విసిరేసే బంతి కాడని, ఆయనకు కొన్ని హక్కులంటూ ఉన్నాయని విజయ్ అగర్వాల్ చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: TANA Election Live: అమెరికాలో కొనసాగుతున్న ‘తానా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. మరికొన్ని గంటల్లో ఫలితాలు