అక్కడ కేజీ ఉల్లి ధర 220 రూపాయలు మాత్రమే!

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కాయి. అవును గతకొద్ది కాలంగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా రూ.10 కిలో పలికే ఉల్లి ధర.. గత ఆగస్ట్ నుంచి క్రమ క్రమంగా పెరుగుతూ రూ. 50కి చేరుకుంది. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉల్లి ధర రూ.100కి పైగా పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి రూ.80 నుంచి 100 మధ్య పలుకుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి కొండెక్కి కూర్చొంది. మొన్నటి వరకు రూ.50 ఉన్న నాణ్యమైన ఉల్లి […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:38 pm, Mon, 18 November 19
అక్కడ కేజీ ఉల్లి ధర 220 రూపాయలు మాత్రమే!

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కాయి. అవును గతకొద్ది కాలంగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా రూ.10 కిలో పలికే ఉల్లి ధర.. గత ఆగస్ట్ నుంచి క్రమ క్రమంగా పెరుగుతూ రూ. 50కి చేరుకుంది. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉల్లి ధర రూ.100కి పైగా పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి రూ.80 నుంచి 100 మధ్య పలుకుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి కొండెక్కి కూర్చొంది. మొన్నటి వరకు రూ.50 ఉన్న నాణ్యమైన ఉల్లి ధర.. ప్రస్తుతం రూ.70 నుంచి 80 వరకు పలుకుతుంది.

అయితే దీనికి కారణం.. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కురిసిన భారీ వర్షాల కారణంగా.. ఉల్లి సాగుకు అంతరాయం కలిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చేతికందిన పంట పలుచోట్ల నీటమునగడంతో.. ఉల్లికి డిమాండ్ పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఉల్లి ధర ఉపశమనం కోసం అనేక ప్రయత్నాలు చేపట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేసి.. సబ్సిడీతో అమ్మకాలు చేపడుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంది. విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది.

ఈ క్రమంలో భారత్ నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో ఉల్లిపాయలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కిలో ఉల్లిపాయల ధర రూ.220కు చేరింది. అనూహ్యంగా ధరలు పెరిగిపోవడంతో పలుచోట్ల వినియోగదారులు ఆందోళనకు దిగారు. దీంతో బంగ్లా ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటూ ధరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. ధరల పెరుగులతో వినియోగం తగ్గిందని.. దీంతో తమ వ్యాపారాలు మందగించాయని చిన్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

https://twitter.com/KalaHarshit/status/1176785954591215616