AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One year for Amaravati protest: రాజధాని ఉద్యమానికి ఏడాదిపూర్తి.. రాయపూడిలో అమరావతి రైతుల ‘జనభేరి’ బహిరంగసభ

ఏడాదైంది. రాజధానిని మార్చడానికి వీల్లేదంటూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలకు సరిగ్గా ఇవాళ్టితో సంవత్సరం గడిచింది...

One year for Amaravati protest: రాజధాని ఉద్యమానికి ఏడాదిపూర్తి..  రాయపూడిలో అమరావతి రైతుల 'జనభేరి' బహిరంగసభ
Venkata Narayana
|

Updated on: Dec 17, 2020 | 9:52 AM

Share

ఏడాదైంది. రాజధానిని మార్చడానికి వీల్లేదంటూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలకు సరిగ్గా ఇవాళ్టితో సంవత్సరం గడిచింది. ప్రజారాజధానిగా అమరావతే ఉండాలని చేస్తున్న ఉద్యమం ఏడాది పూర్తైన సందర్భంగా ఇవాళ రాయపూడిలో జనభేరి పేరుతో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఈసభకు కండిషన్స్‌తో కూడిన పర్మిషన్ ఇచ్చారు అధికారులు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల లోపే సభ ముగించాలి. జనాన్ని పోగు చేయకుండా…ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా శాంతియుతంగా చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదన్నారు పోలీసులు. మరోవైపు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని…కఠిన చర్యలు తీసుకుంటామని ముందే వార్నింగ్ ఇచ్చారు. జనభేరి పేరుతో నిర్వహిస్తున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు రైతులు, రాజకీయ పార్టీలు, రాజధాని పరిరక్షణ సమితి సమాయత్తమయ్యాయి. రాయపూడి సభకు వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు.