
ఏపీలో వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో ర్యాపిడ్ టెస్టు కిట్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. వివిధ జిల్లాలకు ఈ ర్యాపిడ్ టెస్టు కిట్లు చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం లక్షా పదహారు వేల ఎనిమిది వందల ర్యాపిడ్ టెస్టు కిట్లను జిల్లాలకు పంపిణీ చేసినట్లు మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ర్యాపిడ్ కిట్లు చేరుకున్నాయి. మొత్తం లక్షా 16 వేల 800 ర్యాపిడ్ కిట్లను జిల్లాలకు పంపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన జిల్లాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. వాటికి పెద్ద సంఖ్యలో కరోనా కిట్లను పంపిణీ చేశారు. కేసులు అధికంగా వున్న నాలుగు జిల్లాలకు మొత్తం 46 వేల 508 ర్యాపిడ్ టెస్టు కిట్లను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కృష్ణా జిల్లాకు 13వేల 22 కిట్లు, గుంటూరు జిల్లాకు 12 వేల 595 కిట్లు, కర్నూల్ జిల్లాకు 12 వేల 75 కిట్లు, నెల్లూరు జిల్లాకు 8 వేల 816 కిట్లను పంపిణీ చేశారు. రేపట్నించి పెద్ద సంఖ్యలో ర్యాపిడ్ టెస్టులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులకు ర్యాపిడ్ టెస్టు కిట్లను సరఫరా చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.