కోజికోడ్ లో కుప్పకూలిన భవనం.. వృద్దుడు మృతి

కేరళ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. భవనం కుప్పకూలిన ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

కోజికోడ్ లో కుప్పకూలిన భవనం.. వృద్దుడు మృతి

Updated on: Oct 23, 2020 | 6:42 AM

కేరళ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. భవనం కుప్పకూలిన ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ నగరంలోని కన్నన్ చెరి ప్రాంతంలో రెండు అంతస్తుల భవనం గురువారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో భవనంలో ఉన్న రామచంద్రన్ (64) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రామచంద్రన్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. జిల్లా కలెక్టరు సాంబశివరావు సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. మృతుడు కూలిన భవనంలో ఫ్యాన్సీ ఆభరణాల గోదాం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భవన శిథిలాల కింద మరెవరైన ఉన్నారని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపులు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.