ఆర్టీసీ బ‌స్సులో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో తనిఖీలు… రూ.1.9 కోట్ల న‌గ‌దు ప‌ట్టివేత‌

|

Dec 13, 2020 | 2:31 PM

ఆర్టీసీ బస్సులో రూ.1.9 కోట్ల నగదు పట్టుబడింది. కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో ఈ నగదు బయటపడింది.

ఆర్టీసీ బ‌స్సులో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో తనిఖీలు... రూ.1.9 కోట్ల న‌గ‌దు ప‌ట్టివేత‌
Follow us on

ఆర్టీసీ బస్సులో రూ.1.9 కోట్ల నగదు పట్టుబడింది. కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో ఈ నగదు బయటపడింది. అనంతపురంలోని మారుతినగర్ కు చెందిన కోనేరు రామచౌదరి, గుంతకల్ కు చెందిన రంగనాయకులు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు కుప్పం డిపో బస్సులో వస్తుండగా, పక్కా సమాచారంతో సీఐ ల‌క్ష్మీ దుర్గయ్య, సిబ్బంది తో కలిసి బస్పసును తనిఖీ చేశారు. దీంతో వీరిద్దరి బ్యాగుల్లో రూ.1.9 కోట్ల నగదు బయపడింది.

ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నగదును సీజ్ చేసి కర్నూలు అర్బన్ పోలీసు స్టేషన్లో అప్పగించామన్నారు. కాగా, పట్టుబడ్డ నగదుపై రామచౌదరిని విచారించగా, పొలం కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లామని, బేరం కుదరకపోవడంతో డబ్బులతో స్వగ్రామానికి వెళ్తున్నామని పోలీసులకు తెలిపారు.