వ్యాక్సిన్ వికటించడంతో బాలుడు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం

| Edited By:

Mar 07, 2019 | 3:48 PM

హైదరాబాద్ : నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వికటించిన వ్యాక్సిన్‌ల వార్త కలకలం రేపుతోంది. నిన్న చిన్నారులకు వేసిన వ్యాక్సిన్‌లు వికటించాయి. ఈ ఘటనలో ఆస్సత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతిచెందినట్లు తెలుస్తుంది. మొత్తం 15మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిన్నారుల్ని చికిత్స నిమిత్తం హెల్త్ సెంటర్‌ నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీకా వేసిన […]

వ్యాక్సిన్ వికటించడంతో బాలుడు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
Follow us on

హైదరాబాద్ : నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వికటించిన వ్యాక్సిన్‌ల వార్త కలకలం రేపుతోంది. నిన్న చిన్నారులకు వేసిన వ్యాక్సిన్‌లు వికటించాయి. ఈ ఘటనలో ఆస్సత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతిచెందినట్లు తెలుస్తుంది. మొత్తం 15మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిన్నారుల్ని చికిత్స నిమిత్తం హెల్త్ సెంటర్‌ నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీకా వేసిన రెండు గంటల్లోపే పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆరోపిస్తున్నారు. నిన్న నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో మొత్తం 90 మంది పిల్లలకు టీకాలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హుజురాబాద్ నుంచి ఆయన నిలోఫర్ ఆస్పత్రికి బయల్దేరారు.