ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ప్రభావం తక్కువట..!

|

Jun 10, 2020 | 8:48 PM

ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వారికి మాత్రం కరోనా వైరస్ సోకే లక్షణాలు తక్కువంటోంది 23 అండ్‌ మీ అనే జెనెటిక్ టెస్టింగ్‌ సంస్థ.

ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ప్రభావం తక్కువట..!
Follow us on

రోనా మహమ్మారి ప్రపంచాన్నే శాసిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైనా ఇప్పటి వరకు ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయాయి. ఇంకా ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ.. ఖచ్చితమైన సమయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వారికి మాత్రం కరోనా వైరస్ సోకే లక్షణాలు తక్కువంటోంది 23 అండ్‌ మీ అనే జెనెటిక్ టెస్టింగ్‌ సంస్థ.
ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకినప్పటికి అనేక మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. దీనిపై అమెరికాకు చెందిన 23 అండ్‌మీ అనే జెనెటిక్ టెస్టింగ్‌ సంస్థ అధ్యయనం జరుపుతోంది. జన్యు శాస్త్రానికి సంబంధించిన ఈ అధ్యయనం ఇంకా పూర్తి కానప్పటికి.. ప్రిలిమినరీ ఫలితాల్లో ఒక విషయాన్ని గుర్తించనట్లు సంస్థ చెబుతోంది. కరోనా బారిన పడుతున్న వారిలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు తక్కువగా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. మిగతా బ్లడ్ గ్రూప్‌లతో పోల్చితే ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో 9 నుంచి 18 శాతం మంది కరోనా బారిన పడుతున్నారని సంస్థ వివరించింది. దాదాపు 8 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందన్నారు. అయితే తమ అధ్యయనంలో పూర్తి ఫలితాలు ఇంకా రాలేదని.. ఇవి కేవలం ప్రారంభస్థాయిలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. మరోవైపు మార్చి నెలలో జరిపిన పరిశోధనలోనూ సరిగ్గా ఇలాంటి ఫలితాలే వచ్చాయని తెలిపింది. ఈ అధ్యయనంలో టైప్ ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు తక్కువ సంఖ్యలో కరోనా బారిన పడితే.. టైప్ ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్టు తెలిసింది. కానీ, దీనిపై స్పష్టమైనా అధారాలకు సంబంధించిన వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.