ఆట వస్తువు గొంతులో ఇరుక్కొని ఏడాదిన్నర పాప మృతి చెందింది. విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలం చినగుడబలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ వీధికి చెందిన సంధ్యారాణి తన ఏడాదిన్నర పాప మౌనికకు తినేందుకు స్నాక్ ప్యాకెట్ ఇచ్చింది. తినుబండారాలు తింటూ చిన్నారి అందులోని ఆట బొమ్మను తెలియక మింగేసింది. దీంతో పాప ఉక్కిరిబిక్కిరై స్పృహతప్పి పడిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పార్వతీపురం ఏరియా హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. డాక్టర్లు పోస్టుమార్టం చేసి గొంతులో ఇరుక్కున్న ఆట వస్తువును బయటకు తీశారు. ఘటనపై పాప పేరెంట్స్ గురుగుబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ( రైతులకు అలెర్ట్ : పీఎం కిసాన్ స్కీమ్ డబ్బు పడకపోతే ఇలా చేయండి ! )