జేఈఈ, నీట్ పరీక్షలు, రివ్యూ పిటిషన్లపై రేపు ‘సుప్రీం’ విచారణ
జేఈఈ ,నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను తిరిగి సమీక్షించాలని కోరుతూ ఆరు ప్రతిపక్ష పాలిత..

జేఈఈ ,నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను తిరిగి సమీక్షించాలని కోరుతూ ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లమీద సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. తమ ఛాంబర్లలో న్యాయమూర్తులు వీటిని విచారించబోతున్నారు. విద్యార్థులు భవిష్యత్ దృష్ట్యా కోర్టు తగిన నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్లు కోరుతున్నారు.
ఇప్పటికే విద్యార్థులు తమ విద్యా సంవత్సరం నష్టపోకుండా చూసేందుకు కేంద్రం ఈ పరీక్షలను నిర్వహించాలనే కృత నిశ్చయంతో ఉంది.



