ఒమన్ సర్కార్ కీలక నిర్ణయం.. వీసా లేకున్నా రావచ్చు..!

మస్కట్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త... గల్ఫ్ దేశమైన ఒమన్ ఏకంగా 100 దేశాలకు చెందిన పౌరులను తమ దేశంలో వీసా అవసరం లేకుండా సందర్శించే అవకాశం కల్పించింది.

ఒమన్ సర్కార్ కీలక నిర్ణయం.. వీసా లేకున్నా రావచ్చు..!

Updated on: Nov 03, 2020 | 4:31 PM

మస్కట్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త… గల్ఫ్ దేశమైన ఒమన్ ఏకంగా 100 దేశాలకు చెందిన పౌరులను తమ దేశంలో వీసా అవసరం లేకుండా సందర్శించే అవకాశం కల్పించింది. ఆ దేశంలోకి పెట్టుబడులతో పాటు ఆదాయాన్ని పెంచుకునే ఫ్లాన్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 100 దేశాలకు చెందినవారు వీసా అవసరం లేకుండా సుల్తానేట్ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతి ఇస్తున్నట్లు ఒమన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఆ దేశాల జాబితాను మాత్రం ఒమన్ ఇంకా విడుదల చేయలేదు. ఈ నిర్ణయంతో దేశానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరగడంతో పాటు పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జీసీసీ దేశాలైన యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ పౌరులకు మాత్రమే వీసా లేకుండా ఒమన్ సందర్శించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం కొవిడ్ విజృంభణ నేపథ్యంలో విజిట్ వీసా సర్వీసులను ఒమన్ నిలిపివేసింది. విదేశీయుల అనుమతికి సంబంధించిన అయా దేశాల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Follow Us