48 గంటలపాటు.. ఆ మూడు నగరాలు.. కంప్లీట్ షట్‌డౌన్!

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో పాటు కటక్, భద్రక్ నగరాలను 48 గంటల పాటు

48 గంటలపాటు.. ఆ మూడు నగరాలు.. కంప్లీట్ షట్‌డౌన్!

Edited By:

Updated on: Apr 03, 2020 | 10:57 PM

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో పాటు కటక్, భద్రక్ నగరాలను 48 గంటల పాటు షట్‌డౌన్ చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ‘ఈ రెండు రోజులు నిత్యావసరాల దుకాణాలు కూడా తెరిచేందుకు అనుమతి లేదు.

కాగా.. వైద్య సదుపాయాలు మాత్రం ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అందుబాటులో ఉంటాయ’ని డీజీపీ అభయ్ తెలిపారు. ‘ఈ నగరాల్లో కరోనా మూడో స్టేజికి చేరే అవకాశం ఉన్నట్లు మా దృష్టికొచ్చింది. అందుకే నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే క్రమంలో ఈ చర్య తీసుకున్నాం’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్ త్రిపాఠి తెలిపారు.