AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ Vs IND: మరోసారి కోహ్లీసేన ఫ్లాప్ షో.. వైట్‌వాష్ తప్పదా.?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచింది. కివీస్ బౌలర్ కైల్ జమీసన్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటడంతో ఇండియా 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయింది...

NZ Vs IND: మరోసారి కోహ్లీసేన ఫ్లాప్ షో.. వైట్‌వాష్ తప్పదా.?
Ravi Kiran
|

Updated on: Feb 29, 2020 | 2:31 PM

Share

NZ Vs IND: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచింది. పృథ్వీ షా(54), పుజారా(54), విహారీ(55)లను మినహాయిస్తే.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తక్కువ పరుగులకు ఔట్ కావడం టీమిండియాను కలవరపెడుతోంది.

ఇదిలా ఉంటే మొదటి టెస్టులో ఇండియా పతనంతో కీలక పాత్ర పోషించిన కివీస్ బౌలర్ కైల్ జమీసన్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. వెనువెంటనే వికెట్లు తీసి తన రెండో టెస్టులోనే ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో ఇండియా 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో జమీసన్ 5 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, సౌథీలు చెరో రెండు, వాగ్నర్ ఒక వికెట్ తీశాడు. కాగా, టెస్ట్ సిరీస్‌లో కూడా భారత్‌కు వైట్ వాష్ తప్పదనిపిస్తోంది.

For More News: 

అక్కడ కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట.. ఎందుకంటే..

వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాతోనే ‘దీప’ వెండితెర ఎంట్రీ.!

అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…

కోహ్లీకి అసలు ఏమైంది.?

Follow Us