భక్తికి ఎల్లలు లేవని చాటి చెబుతున్నారు భారతీయులు. అగ్రరాజ్యంలోనూ భారతీయత ఉట్టిపడేలా ఆలయాలు నిర్మిస్తూ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో సాయినాథుణ్ణి ప్రతిష్టించి తరించారు. శాన్‌మాటో ఎల్డోరాడో స్ట్రీట్‌లో నిర్మించిన అష్టలక్ష్మీ టెంపుల్‌లో ముందుగా సాయినాథుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బే ఏరియాలో ఇదే మొదటి టెంపుల్ అని.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అర్చకులు తెలిపారు.