బక్రీద్ పండుగ నేపథ్యంలో.. ఆన్‌లైన్‌లో మేకలు, గొర్రెల విక్రయం..

| Edited By:

Jul 06, 2020 | 1:09 AM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బక్రీద్ పండుగ కోసం.. ఆన్‌లైన్‌లో మేకలు, గొర్రెలు విక్రయించేందుకు నెట్ లైవ్ స్టాక్ డాట్ కాం ను ప్రారంభించారు.

బక్రీద్ పండుగ నేపథ్యంలో.. ఆన్‌లైన్‌లో మేకలు, గొర్రెల విక్రయం..
Follow us on

Online market to sell goats: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బక్రీద్ పండుగ కోసం.. ఆన్‌లైన్‌లో మేకలు, గొర్రెలు విక్రయించేందుకు నెట్ లైవ్ స్టాక్ డాట్ కాం ను ప్రారంభించారు. అలీఘడ్ ముస్లిమ్ యూనివర్శిటీ అలూమ్నీ సభ్యులు దీనికి శ్రీకారం చుట్టారు. రైతులు, వినియోగదారులను కలిపుతూ మేకలు, గొర్రెలను ఆన్‌లైన్‌లో విక్రయానికి తెర తీసింది ఈ వెబ్ సైట్.

కోవిద్-19 సంక్షోభ సమయంలో మార్కెట్‌కు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో రైతులకు, వినియోగదారులను అనుసంధానం చేసేందుకు నెట్ లైవ్ స్టాక్ డాట్ కాంను ప్రారంభించామని పీజీ విద్యార్థి ఖలీద్ రజా చెప్పారు. ఆన్ లైన్ లో కొన్న మేకలు, గొర్రెలను కొన్న వారి ఇంటి ముంగిట డెలివరీ ఇచ్చేలా సహాయకులను నియమించామని ఖలీద్ చెప్పారు. బక్రీద్ పండుగ కోసం ఆన్ లైన్‌లో మేకలు, గొర్రెల విక్రయాలను జంతుప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు.