ఢిల్లీలో నిజాం స్టాంపుల ప్రదర్శన

నిజాం కాలంనాటి అత్యంత అరుదైన పోస్టల్ స్టాంపులతో ఢిల్లీలో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇవారీ కలెక్షన్స్, గు జ్రాల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ కాలంలో పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా పనిచేసిన నవాబ్ ఇక్బాల్ హుస్సేన్ ఖాన్ సేకరించిన స్టాంపులను మొదటిసారిగా ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. ఢిల్లీలోని బైకనూర్ భనవ్‌లో మార్చి 9 నుంచి 24 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నిజాం నవాబులు మొట్టమొదటిసారిగా 1869లో విడుదల […]

ఢిల్లీలో నిజాం స్టాంపుల ప్రదర్శన

Edited By:

Updated on: Mar 09, 2019 | 1:17 PM

నిజాం కాలంనాటి అత్యంత అరుదైన పోస్టల్ స్టాంపులతో ఢిల్లీలో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇవారీ కలెక్షన్స్, గు జ్రాల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ కాలంలో పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా పనిచేసిన నవాబ్ ఇక్బాల్ హుస్సేన్ ఖాన్ సేకరించిన స్టాంపులను మొదటిసారిగా ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు.

ఢిల్లీలోని బైకనూర్ భనవ్‌లో మార్చి 9 నుంచి 24 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నిజాం నవాబులు మొట్టమొదటిసారిగా 1869లో విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు మొదలుకొని, వివిధ సమయాల్లో వినియోగించిన స్టాంపులు, అప్పటి లెటర్లు, పోస్ట్ కార్డులు, రెవెన్యూ స్టాంపులు, సీళ్లు, ముద్రలు వంటివి ఈ ప్రదర్శనలో ఉంచనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రర్శనలో హైదరాబాద్ సంస్థానం మొదటిస్టాంపుతోపాటు 1931నాటి స్మారక చిహ్నాలు, ఏడో కింగ్ జార్జ్ పేరుమీద 1937లో విడుదల చేసిన తపాలా బిల్లలు, 1905 నాటి పోస్టేజ్ స్టాంపులను ప్రదర్శిస్తామన్నారు.