ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరికు నివర్ తుఫాన్అలెర్ట్. చెన్నై కి 420 కిలోమీటర్ల దూరంలో ఏర్పడ్డ వాయుగుండం రానున్న 12 గంటల్లో తుఫాన్ గా మారబోతోంది. ఫలితంగా తమిళనాడులోని 7 జిల్లాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం.. తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో ప్రజా రవాణా రద్దు చేసింది.
చెన్నై నుంచి నాగపట్నం వైపు వెళ్లే రైళ్లను రైల్వేశాఖ రద్దు చేయగా, ఎం.డి.ఆర్.ఎఫ్ బృందాలు ప్రభావితమయ్యే ప్రాంతాలకు చేరుకున్నాయి. పుదుచ్చేరిలో ప్రభావిత ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన సీఎం నారాయణ స్వామి.. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. అటు, ఎపి లోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. దక్షిణ కోస్తాకు చెదరు మొదరు వర్షాలు పడే అవకాశం ఉంది.