NITI Aayog: వాటిపై జీఎస్టీ పన్ను రేటు పెంచే పనిలో నీతి ఆయోగ్.. కారణం అదేనా..

NITI Aayog: దేశప్రజల్లో అనేక మంది ఊబకాయ(Obesity) సమస్య రోజురోజుకూ అధికమవుతున్న వేళ నీతి ఆయోగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

NITI Aayog: వాటిపై జీఎస్టీ పన్ను రేటు పెంచే పనిలో నీతి ఆయోగ్.. కారణం అదేనా..
Niti Aayog

Updated on: Feb 28, 2022 | 10:08 AM

NITI Aayog: దేశప్రజల్లో అనేక మంది ఊబకాయ(Obesity) సమస్య రోజురోజుకూ అధికమవుతున్న వేళ నీతి ఆయోగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చక్కెర, ఫ్యాట్, ఉప్పు అధికంగా ఉండే చిరు తిళ్లు(Ready made Snacks), మిగిలిన ఆహారపదార్థాలపై అధిక పన్ను విధించాలని యోచిస్తున్నట్లు వార్షిక నివేదిక చెబుతోంది. దేశంలోని పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల వారిలోనూ అధిక బరువు సమస్య పెరగటంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది.

దీనికి సంబంధించి జూన్ 2021 లో జరిన సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య రంగానికి చెందిన నిపుణుల నుంచి దీనిపై కీలక సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా స్థూలకాయ సమస్యకు కారణమయ్యే ఆహారపదార్థాల ప్యాకింగ్‌పై ముందు భాగంలో లేబులింగ్‌, మార్కెటింగ్‌ సహా అధిక పన్నుల వంటి ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగినట్లు నివేదిక చెబుతోంది. ప్రస్తుతం అన్ బ్రాండెడ్ రెడీమేడ్ చిరుతిళ్లపై జీఎస్టీ 5 శాతంగా ఉండగా.. బ్రాండెడ్ ప్రాడక్టపై ఇది 12 శాతం జీఎస్టీ అమలవుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 2019-20 నివేధిక ప్రకారం పురుషుల్లో 22.9 శాతం, మహిళల్లో 24శాతం ఈ సమస్య ఉన్నట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి..

Stock Market Update: ప్రపంచ మార్కెట్లపై పుతిన్ వార్నింగ్ ఎఫెక్ట్.. నష్టాలతో మొదలైన ముంబై బజార్ ..

Low Interest Home Loan: తక్కువ వడ్డీకి హోమ్ లోన్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే..

Mahindra EV Cars: ఎలక్ట్రిక్ వాహనాలపై మహీంద్రా భారీ పెట్టుబడి.. రానున్న మూడేళ్లలో ఎన్నికోట్లు వెచ్చించనుందంటే..