నా ప్రవచనమే రాజ్యాంగం.. నా మాటే శాసనం: స్వామి నిత్యానంద

నా ప్రవచనమే రాజ్యాంగం.. నా మాటే శాసనం: స్వామి నిత్యానంద

ఆయనో సామి.. గుడి వెనుక ఆసామి. మనదేశంలో చెయ్యరాని పనులెన్నో చేశాడు . అత్యాచార కేసుల్లో ఇరుక్కున్నాడు. అర్ధ సెంచరీ కేసుల్ని మెడకు చుట్టుకున్నాడు. అమాయకులను బురిడీ కొట్టించాడు. అరెస్టయ్యే టైముకు చెక్కేశాడు. పాస్‌పోర్ట్ లేకపోయినా రహస్యంగా మరో దేశానికి చేరాడు. అక్కడ ఓ దేశాన్నే సృష్టించాడు. ఇప్పుడు అందరిని అక్కడికి ఆహ్వానిస్తున్నాడు. నా ప్రవచనమే రాజ్యాంగం.. నా మాటే శాసనం అంటూ శివగామి లెవెల్లో శివాలెత్తుతున్నాడు. మరి ఆ సామి సృష్టించిన ఆ దేశం ఎక్కడుంది? […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Dec 04, 2019 | 5:48 PM

ఆయనో సామి.. గుడి వెనుక ఆసామి. మనదేశంలో చెయ్యరాని పనులెన్నో చేశాడు . అత్యాచార కేసుల్లో ఇరుక్కున్నాడు. అర్ధ సెంచరీ కేసుల్ని మెడకు చుట్టుకున్నాడు. అమాయకులను బురిడీ కొట్టించాడు. అరెస్టయ్యే టైముకు చెక్కేశాడు. పాస్‌పోర్ట్ లేకపోయినా రహస్యంగా మరో దేశానికి చేరాడు. అక్కడ ఓ దేశాన్నే సృష్టించాడు. ఇప్పుడు అందరిని అక్కడికి ఆహ్వానిస్తున్నాడు. నా ప్రవచనమే రాజ్యాంగం.. నా మాటే శాసనం అంటూ శివగామి లెవెల్లో శివాలెత్తుతున్నాడు. మరి ఆ సామి సృష్టించిన ఆ దేశం ఎక్కడుంది? పరారైన అతగాణ్ణి మన దేశం తిరిగి రప్పిస్తుందా? శిక్ష వేస్తుందా? చూడాలి మరి.

భారత్ నుండి చెక్కేసిన స్వామి నిత్యానంద ఓ దేశాన్నే సృష్టించాడు. ఆ దేశం పేరు ‘కైలాస’. ఇది ఒక ద్వీప దేశం. ఈ దేశానికి జెండా, పాస్‌పోర్ట్ లు, ఎంబ్లమ్ రెడీ అయ్యాయి. ఈక్వెడార్ నుంచి ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు నిత్యానంద. ఇది ట్రినిడాడ్-టొబాగోల సమీపంలో ఉంటుంది. ఇది సంపూర్ణ హిందూ దేశం. భక్తులు తమకు తోచినంత విరాళాలు ఇవ్వాలని కూడా పిలుపునిచ్చాడు నిత్యానంద. కైలాసాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి న్యాయ నిపుణుల బృందాన్ని కూడా పంపించాడు. తనకు ఇక భారత్ తో సంబంధాలు లేవని ప్రకటించాడు. భారత్ లో హిందువులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించాడు నిత్యానంద. ఈ దేశ పాస్‌పోర్టులు రెండు రంగుల్లో ఉంటాయి. ఒకటి గ్రీన్, మరోకటి రెడ్. ఈ దేశానికి కేబినెట్ ఏర్పాటుచేసి ప్రధానమంత్రిని కూడా నియమించాడు. కైలాసంలో పౌరులకు ఉచితంగా ఆహారం, ఉచిత వైద్య సదుపాయం, పిల్లలకు ఉచిత విద్య అమలు చేస్తానని హామీ ఇస్తున్నారు.  నా ప్రవచనాలే రాజ్యాంగం అని, ఎవరిని బలవంతంగా రప్పించడంలేదని తెలిపారు స్వామి నిత్యానంద.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu