ఉల్లి వ్యాపారిగా మాజీ ఎంపీ..!

ఉల్లి ధరల పెరుగుదలను నిరసిస్తూ మాజీ ఎంపి, జన అధికార్ పార్టీ (జెఎపి) కన్వీనర్ పప్పు యాదవ్ పాట్నా వీధుల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. బీహార్ రాజధానిలో ఉల్లి ధర 100 రూపాయలకు చేరుకోవడంతో, యాదవ్ రాష్ట్ర రాజధానిలోని బిజెపి కార్యాలయం వెలుపల, ఉల్లిపాయలను కిలో 35 రూపాయలకు అమ్మారు. అయితే.. వందలాది మంది వీటిని కొనడానికి క్యూ కట్టారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉల్లిపాయల ధరలను నియంత్రించడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన  ఈ విధంగా […]

ఉల్లి వ్యాపారిగా మాజీ ఎంపీ..!
Follow us

| Edited By:

Updated on: Dec 04, 2019 | 12:34 AM

ఉల్లి ధరల పెరుగుదలను నిరసిస్తూ మాజీ ఎంపి, జన అధికార్ పార్టీ (జెఎపి) కన్వీనర్ పప్పు యాదవ్ పాట్నా వీధుల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. బీహార్ రాజధానిలో ఉల్లి ధర 100 రూపాయలకు చేరుకోవడంతో, యాదవ్ రాష్ట్ర రాజధానిలోని బిజెపి కార్యాలయం వెలుపల, ఉల్లిపాయలను కిలో 35 రూపాయలకు అమ్మారు. అయితే.. వందలాది మంది వీటిని కొనడానికి క్యూ కట్టారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఉల్లిపాయల ధరలను నియంత్రించడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన  ఈ విధంగా నిందించారు. కేంద్రం ఉల్లిపాయలను దిగుమతి చేసుకోబోతోందని, డిసెంబర్ మధ్య నాటికి ధరలు తగ్గుతాయని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఇచ్చిన హామీలపై పప్పు యాదవ్ విరుచుకుపడ్డారు. కేంద్రం ఇంధనానికి సబ్సిడీ ఇవ్వగలిగినప్పుడు ఉల్లిపాయలపై మాత్రం ఎందుకు సబ్సిడీ ఇవ్వలేరని అయన నిలదీసారు.

అంతకుముందు, చిల్లర వ్యాపారులు ఉల్లిపాయలను 10 టన్నుల వరకు, టోకు వ్యాపారులు 50 టన్నుల వరకు నిల్వ ఉంచడానికి అనుమతించారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడు వారు అందులో సగం నిల్వ ఉంచుకోవచ్హు. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలకు సవరించిన స్టాక్ హోల్డింగ్ పరిమితి వర్తించదు. చిల్లర, హోల్‌సేల్ వ్యాపారులు ఉల్లిపాయల నిల్వ వివరాలను ప్రతిరోజూ మంత్రిత్వ శాఖకు అందజేయాలని ఆదేశించారు.