
Nirbhaya Case: నిర్భయ దోషులు నలుగురి అవయవాలను దానం (డొనేట్) చేయాలని ఆదేశించవలసిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘కాస్త మానవతా దృక్పథం ఉండాలని ‘ వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తిని ఉరి తీయడమన్నది ఆ కుటుంబానికి విషాదకరమైన విషయమని, మీరు ఈ దోషుల శరీరాలు ముక్కలు కావాలని కోరుతున్నారని, కాస్త మానవత్వం చూపాలని సూచించింది. అవయవదానం అన్నది సంబంధిత వ్యక్తులు స్వఛ్చందంగా ఇస్తారని గుర్తు చేసింది. నిర్భయ దోషులు నలుగురు తమ శరీరాలను మెడికల్ రీసెర్చ్ కి ఇచ్చెందుకు, తమ అవయవాలను డొనేట్ చేయవలసిందిగాను వారికి ఆప్షన్ ఇచ్ఛేలా తీహార్ జైలు అధికారులను ఆదేశించవలసిందిగా మాజీ జడ్జి ఎఫ్. సల్దానా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని కోర్టు కొట్టివేసింది.