నిర్భయ కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ.. ఎందుకంటే ?

నిర్భయ కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. అయితే ఈ పిటిషన్ ను విచారించే బెంచ్ నుంచి తాను వైదొలగుతున్నట్టు సీజేఐ జస్టిస్ ఎస్. ఎ. బాబ్డే ప్రకటించారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు మరో ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్భయ తల్లి తరఫున వాదించిన అడ్వొకేట్లలో ఒకరు తన కుటుంబ సభ్యులని, అందువల్ల విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను […]

నిర్భయ కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ.. ఎందుకంటే ?
Follow us

|

Updated on: Dec 17, 2019 | 3:38 PM

నిర్భయ కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. అయితే ఈ పిటిషన్ ను విచారించే బెంచ్ నుంచి తాను వైదొలగుతున్నట్టు సీజేఐ జస్టిస్ ఎస్. ఎ. బాబ్డే ప్రకటించారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు మరో ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్భయ తల్లి తరఫున వాదించిన అడ్వొకేట్లలో ఒకరు తన కుటుంబ సభ్యులని, అందువల్ల విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నానని జస్టిస్ బాబ్డే వివరించారు. అక్షయ్ సింగ్ వేసిన పిటిషన్ పై ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇఛ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి విదితమే.. అయితే ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ దోషి అక్షయ్ సింగ్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. ఢిల్లీలోని కాలుష్యాన్ని కూడా సాకుగా చూపాడు. ఇదిలా ఉండగా ఈ కేసులో .. ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ అనే ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్లను గత ఏడాది జులైలో కోర్టు కొట్టివేసింది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.