మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఫిక్స్ అయిందా? ఆమె త్వరలోనే ఓకింటామె కాబోతుందా? అంటే అవుననే అర్థం వస్తుంది ఆమె చేసిన పోస్టులు చూస్తుంటే.. తాజాగా నిహారిక కొణిదెల తన పెళ్లి న్యూస్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మొదటిగా స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘మిస్ నిహా’ అని రాసి దాని కిందనే మిసెస్ అని పెట్టిన ఓ పోస్టును షేర్ చేసిన మెగా డాటర్.. ఆ తర్వాత పోస్టులో తనకు కాబోయే వరుడిని గట్టిగా హాగ్ చేసుకుని కనిపించింది. అయితే ఇందులో మాత్రం అతడి ఫేస్‌ను రివీల్ చేయకుండా ఫ్యాన్స్‌లో సస్పెన్స్‌ను అమాంతం పెంచేసింది.
ఏదైనా చిన్న హింట్ ఇస్తే చాలు.. అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతకడం మొదలు పెడతారు. ఇదే కోవలో మెగా డాటర్‌కు కాబోయే వరుడు ఎవరు అంటూ నెటిజన్లు తెగ వెతికేశారు. చివరికి పట్టేశారు. నిహారిక కొణిదెలను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు చైతన్య జొన్నలగడ్డ అని తెలుస్తోంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడని సమాచారం. కాగా, వీరిద్దరి నిశ్చితార్థం ఆగష్టులో ఉండబోతోందని ప్రచారం సాగుతోంది.
Also Read:
ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!
సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!
దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..
బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..