Newly married woman suicide : “అమ్మా..! అతడే గుర్తొస్తున్నాడు”..అత్తారింట్లో నవవధువు ఆత్మహత్య
ఆ యువతి ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. ఆ విషయాన్ని ఇంట్లో అమ్మానాన్నలతో చెప్పింది. కానీ వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా వెంటనే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు.
Newly married woman suicide : ఆ యువతి ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. ఆ విషయాన్ని ఇంట్లో అమ్మానాన్నలతో చెప్పింది. కానీ వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా వెంటనే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. విరహ వేదనను సదరు యువతి భరించలేకపోయింది. రోజుల వ్యవధిలోనే సూసైడ్ నోట్ రాసి..ప్రాణాలు తీసుకుంది. ఆ సూసైడ్ లేఖలో ఉన్న మాటలు చదివితే కన్నీళ్లు రాక మానవు.
‘అమ్మా.. మీకు క్షమాపణలు చెబుతున్నారు. నా వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని పెళ్లి చేశావు. కానీ నాకు ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. నా మనసులో మరో వ్యక్తి ఉన్న విషయం కూడా మీకు తెలుసు. నేను నా భర్తతో యాంత్రికంగా బ్రతకలేకపోతున్నా… ప్రతీ క్షణం భాధను అనుభవిస్తున్నా’అంటూ ఓ నవ వధువు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే… జిల్లాలోని నారాయణగిరికి చెందిన మెడబోయిన రజాక్ కూతురు అభయ(పేరు మార్చాం) భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన రాము(పేరు మార్చాం)తో ఈనెల 11వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అయితే అభయ ఇంతకుముందే ఓ వ్యక్తిని ప్రేమించినా, పేరెంట్స్ ఒత్తిడితో రామును వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రేమించిన వ్యక్తిని వదిలి ఉండలేక బలవన్మరణానికి పాల్పడింది.
Also Read :
Wife beats husband : అపరకాళిగా మారిన ఆళి..భర్తను జెండా కర్రకు కట్టేసి కొట్టింది..ఎందుకో తెల్సా..?
Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు
‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్