Amitabh Bachchan Tweet: తెలియకుండా పోస్ట్ చేశారు.. ఆ వెంటనే క్షమాపణలు చెప్పారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమితాబ్ ట్వీట్..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం తన అభిమానులకు టచ్‌లో ఉంటారు.

Amitabh Bachchan Tweet: తెలియకుండా పోస్ట్ చేశారు.. ఆ వెంటనే క్షమాపణలు చెప్పారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమితాబ్ ట్వీట్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 29, 2020 | 6:14 PM

Amitabh Bachchan Tweet: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం తన అభిమానులకు టచ్‌లో ఉంటారు. తన దైనందిన జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారు బిగ్‌బి. అయితే మనం రోజూ తాగే ‘చాయ్‌’ కి సంబంధించి ఓ కవిత అమితాబ్ కంట పడింది. ఆ వెంటనే దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు బిగ్‌బి. అయితే, అమితాబ్ పోస్ట్‌కు ఓ మహిళా నెటిజన్ ఊహించని రీతిలో రెస్పాండ్ అయ్యింది. ఆ కవిత తాను రాసినది అంటూ అమితాబ్‌కు రీట్వీట్ చేసింది.

‘సర్.. నేను రాసిన కవిత మీ వాల్‌‌పై చూశాను. అది చూసి చాలా సంతోషించాను. కానీ, ఆ కవిత నేను రాసినట్లుగా నా పేరు కూడా మెన్షన్ చేసి ఉంటే చాలా సంతోషించే దానిని. మీ వాల్‌పై నాపేరు ఉన్నందుకు నాకూ గర్వకారణంగా ఉండేది.’ అని సదరు మహిళ అమితాబ్‌కు రీట్వీట్ చేసింది. అయితే ఇది చూసిన అమితాబ్ క్షణాల్లోనే స్పందించారు. సదరు నెటిజన్‌కు క్రిడెట్ ఇస్తూ ఆ కవితను మరోసారి ట్వీట్ చేశారు బిగ్‌బి.

‘ఈ కవిత రాసింది ఎవరనేది ముందుగా నాకు తెలియదు. సన్నిహితులు నాకు పంపగా.. చాలా బాగుంది కదా అని నేను దాన్ని పోస్ట్ చేశాను. ఈ కవిత రాసింది తిషా అగర్వాల్ అని ఇప్పుడే తెలిసింది. తన పేరు మెన్షన్ చేయకుండా కవితను పోస్ట్ చేసినందుకు ఆమెకు క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ అమితాబ్ సదరు మహిళా నెటిజన్‌ను ట్యాగ్ చేశారు. అయితే ఆవెంటనే ఆమె కూడా స్పందించారు. ‘సర్, క్షమాపణలు వద్దు. మీ ఆప్యాయత కావాలి. దీనిని మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’ అంటూ రిప్లై ఇచ్చింది ఆ రచయిత్రి.

Also read:

LRS Scheme: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకూ రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఆదేశం..

కొత్త రకం కరోనా ప్రాణాంతకం కాదు.. వేగంగా విస్తరిస్తుందే కానీ చంపేంత ప్రమాదకరం కాదన్న ఆరోగ్య మంత్రి ఈటల