గచ్చిబౌలి కారు యాక్సిడెంట్‌ కేసులో మరో ట్విస్ట్..!

గచ్చిబౌలి కారు యాక్సిడెంట్‌ కేసులో మరో ట్విస్ట్..!

హైదరాబాద్‌ గచ్చిబౌలి యాక్సిడెంట్‌ కేసు మరోమలుపు తిరుగుతోంది. ఈ కారు ప్రమాదానికి సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Balaraju Goud

|

Nov 09, 2020 | 7:25 PM

హైదరాబాద్‌ గచ్చిబౌలి యాక్సిడెంట్‌ కేసు మరోమలుపు తిరుగుతోంది. ఈ కారు ప్రమాదానికి సంబంధించి అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ప్రమాదానికి గురైన ప్రియాంక, మిత్తి మోదీ వయస్సు కేవలం 20 ఏళ్ల లోపే. ఆ వయస్సులో పబ్‌లో అర్థరాత్రి వరకూ పీకలదాకా తాగి ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అస్సలే యువతీ, యువకులు …ఆపై తాగి ఉన్నారు. ఇక స్టీరింగ్‌ చేతిలో ఉంటే వేగానికి కళ్లెం ఎలా పడుతుంది..? వీరి విషయంలో కూడా సేమ్‌ అదే జరిగింది. జూబ్లీహిల్స్‌ నుంచి బయల్దేరిన వీళ్లు.. ఓవర్‌ స్పీడుగా కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు.

ఒకరేమో జార్జియాలో మెడిషిన్‌ చదివే యువతి. మరొకరు విశాఖలో డిగ్రీ చదివే యువకుడు. లాక్‌డౌన్‌ కారణంగా స్నేహితులిద్దరూ కలిశారు. సరదగా పబ్‌లో గడిపారు. పీకలదాకా తాగారు. అర్థరాత్రి ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేస్తూ వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. చెట్టును ఢీకొట్టిన వోల్వో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అంటే ఏ రేంజ్‌లో స్పీడ్‌గా కారు నడిపారో అర్థమవుతుంది. కారులో బెలూన్‌ లేకపోవడంతో యువతి స్పాట్‌లోనే చనిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు డోర్‌ వెంటనే తెరచుకోవడంతో యువకుడు మిత్తి మోదీ ప్రాణాలతో బయటపడ్డాడు.

కరోనాతో మూతపడ్డ పబ్‌లు మళ్లీ ఓపెన్‌ కావడంతో యువత పీకలదాకా తాగేస్తున్నారు. మత్తులోనే ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలబారిన పడుతున్నారు. వీకెండ్‌లో డ్రంకెన్‌ డ్రైవ్ తనిఖీలు గతంలో మాదిరిగా లేకపోవడంతో యువత స్పీడ్‌కు కళ్లెం పడటం లేదు. దాంతో రెచ్చిపోయి డ్రైవింగ్‌ చేస్తున్నారు.

అసలు ఈ ప్రమాదానికి బాధ్యులెవ్వరు..? పిల్లలకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చిన తల్లిదండ్రులదా..? లేక నిబంధనలు పాటించని పబ్‌లదా..? డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టని పోలీసులదా..? ఏది ఏమైనా…పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లో విచ్చలవిడి సంస్కృతితో యువతను పెడదారి పట్టిస్తున్నారు. పబ్‌లు ఓపెన్‌ అయ్యి మళ్లీ గబ్బు పట్టిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందిని జనం కోరుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu