కోహ్లీ ఔట్.. రోహిత్ ఇన్.. “సీన్ రివర్స్..”

కోహ్లీ ఔట్.. రోహిత్ ఇన్.. సీన్ రివర్స్..

మార్పులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తాజాగా ప్రకటించింది. ఇందులో రోహిత్‌కు చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. కేవలం టెస్టు జట్టులో మాత్రమే రోహిత్‌కు చోటిచ్చిన సెలక్టర్లు..

Sanjay Kasula

|

Nov 09, 2020 | 7:50 PM

Rohit Sharma Added To Squad : పెద్ద రచ్చ.. వివాదాలు.. విమర్శలు.. అన్నింటికీ పులిస్టాప్ పెడుతూ బీసీసీఐ మరో నిర్ణయం తీసుకుంది. చివరికి జట్టులోకి ఎంట్రీ పాస్ ఇచ్చేసింది. మార్పులు చేస్తూ మూడు ఫార్మెట్లకు జట్టు సభ్యులను ప్రకటించింది. అయితే మరో చిన్న మార్పు చేసింది. అయితే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ పితృత్వ సెలవులు మంజూరు చేసింది.

ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే టీమిండియా జట్టులో ఓపెనర్‌ రోహిత్‌ శర్మను చేర్చారు. ముందుగా విడుదల చేసిన భారత క్రికెట్‌ జట్టులో రోహిత్‌ను పక్కకు పెట్టడంతో పెద్ద రచ్చ జరిగింది. ఫిట్‌నెస్‌ పరంగా రోహిత్‌ బాగానే ఉన్నా అతన్ని ఎందుకు చేర్చలేదనే విమర్శలు మొదలయ్యాయి.

దీంతో మార్పులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తాజాగా ప్రకటించింది. ఇందులో రోహిత్‌కు చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. కేవలం టెస్టు జట్టులో మాత్రమే రోహిత్‌కు చోటిచ్చిన సెలక్టర్లు.. వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి ఇచ్చారు.

అయితే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ పితృత్వ సెలవులు మంజూరు చేసింది. గర్భవతి అయిన కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. దీంతో జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి మూడు టెస్టులకు అతడు దూరం కానున్నాడు.

నవంబర్‌ 27 నుంచి ఆసీస్‌ టూర్‌ ఆరంభంకానుంది.అడిలైడ్‌లో తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్‌కు తిరిగి వస్తాడు. వన్డే జట్టులో అదనపు వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్న ఫాస్ట్‌బౌలర్‌ ఇషాంత్‌ శర్మ పూర్తిగా కోలుకోని, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే అతన్ని టెస్టు జట్టులోకి తీసుకోనున్నారు.

ఈ నెల 27వ తేదీ నుంచి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆరంభం ​కానుంది. డిసెంబర్‌ 8వ తేదీతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగియనుండగా, డిసెంబర్‌17వ తేదీ నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం అవుతుంది. మెడికల్‌ రిపోర్ట్‌ ప్రకారం టెస్టు సిరీస్‌ నాటికి రోహిత్‌ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను సాధిస్తాడని భావించిన సెలక్షన్‌ కమిటీ.. వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి ఇచ్చింది.

భుజం గాయం కారణంగా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో పేసర్‌ టీ నటరాజన్‌ను ఎంపిక చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతుండగా గాయపడిన టెస్టు స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా అందుబాటులో ఉండే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu