Fifty lakhs for Jawan family: ఉగ్రవాదులతో హోరాహోరీ జరిగిన పోరులో అసువులు బాసిన వీర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా వుంటామని ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ కుటుంబానికి తక్షణం 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి వీర జవాన్ భార్య రజితకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.
జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులను నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరామర్శించారు. ఉగ్రవాద దాడుల్లో ప్రవీణ్ మరణించడం బాధకరమైన విషయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ ఆయన లేని లోటును తీర్చలేము కానీ.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా వుంటామని వారు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వీర జవాన్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్దిక సాయం ప్రకటించారు మంత్రులు. వీర జవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి వ్యవసాయ భూమి, ఇల్లు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ప్రవీణ్ భార్య రజితకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
ALSO READ: త్వరలోనే మార్కెట్‌లోకి కోవిడ్ వ్యాక్సిన్!
ALSO READ: ఏపీ కోవిడ్ అప్‌డేట్.. అవి తగ్గడం గుడ్‌న్యూసేనా?
ALSO READ: సిటీ ట్రాఫిక్ జామ్‌కు కేటీఆర్ చెక్
ALSO READ: సేవ్ మాన్సస్ ప్రచారంపై మండిపడ్డ సంచయిత