వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!

|

Jan 04, 2021 | 4:56 PM

New Traffic Rule: ట్రాఫిక్ నిబంధనలను లైట్ తీసుకుంటున్నారా.? హెల్మెట్ ధరించడకుండా బైక్ నడుపుతున్నారా.? అయితే ఇది మీకోసమే...

వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!
Follow us on

New Traffic Rule: ట్రాఫిక్ నిబంధనలను లైట్ తీసుకుంటున్నారా.? హెల్మెట్ ధరించడకుండా బైక్ నడుపుతున్నారా.? అయితే ఇది మీకోసమే. సైబరాబాద్ పరిధిలో జనవరి 1వ తేదీ నుంచి ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్‌ను అమలులోకి తీసుకొచ్చారు. దీనితో ఇకపై హెల్మెట్ లేకుండా బండి నడిపినవారిని ఫోటో తీయడం, జరిమానాలు విధించడం చేయకుండా.. వాహనాన్ని అక్కడే ఆపి హెల్మెట్ తెచ్చుకునే వరకు బైక్ ఇవ్వకూడదని నిర్ణయించారు.

రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు ఈ వినూత్న నిర్ణయానికి వచ్చారు. సైబరాబాద్ పరిధిలో ఏడు చోట్ల చెక్ పోస్టులు పెట్టి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే వాహనం పిలెన్ రైడర్(వెనకాల కూర్చున్న వ్యక్తి) కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వెల్లడించారు. దీనిపై పోలిసులు 24/7 పర్యవేక్షణ చేస్తున్నారు. గతేడాది దాదాపుగా 27 శాతం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గాయని.. వాహనదారుల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా కొత్త రూల్‌ను అమలులోకి తీసుకొచ్చామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ వెల్లడించారు.