తెలంగాణ కొత్త సచివాలయం, శాసనసభ భవనాలకు సీఎం కేసీఆర్ కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రస్తుత సచివాలయం డి-బ్లాక్ వెనుకభాగంలోని తోటలో సచివాలయ భవనానికి, 11 గంటలకు ఎర్రమంజిల్‌లోని రోడ్ల భవనాల శాఖ ఆవరణలో శాసనసభ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. సచివాలయం ప్రస్తుతం 20 ఎకరాల్లో ఉండగా.. దానిని 30 ఎకరాల మేరకు విస్తరించనున్నారు.