ఫోన్‌పేలో అదిరిపోయే ఫీచర్.. ఇకపై అలా చేస్తే..!

గూగుల్ పే, ఎంఐ పే, పేటియం.. వంటి అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ కార్యకలాపాలు సులభమయ్యాయి. ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ ఫోన్‌పే తన వినియోగదారులకు ఓ నూతన ఫీచర్‌ను తీసుకువచ్చింది. చాట్‌ పేరిట యూజర్లకు లభిస్తున్న ఈ ఫీచర్‌ సహాయంతో ఫోన్‌పే యాప్‌లో వారు తమ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికి మనీ రిక్వెస్ట్‌ పంపుకోవచ్చు. వీరికి డబ్బులు సులభంగా పంపించుకునే సౌలభ్యం వుంది. అందుకు గాను ఇతర చాట్‌ యాప్‌లను వాడాల్సిన […]

ఫోన్‌పేలో అదిరిపోయే ఫీచర్.. ఇకపై అలా చేస్తే..!

గూగుల్ పే, ఎంఐ పే, పేటియం.. వంటి అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ కార్యకలాపాలు సులభమయ్యాయి. ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ ఫోన్‌పే తన వినియోగదారులకు ఓ నూతన ఫీచర్‌ను తీసుకువచ్చింది. చాట్‌ పేరిట యూజర్లకు లభిస్తున్న ఈ ఫీచర్‌ సహాయంతో ఫోన్‌పే యాప్‌లో వారు తమ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికి మనీ రిక్వెస్ట్‌ పంపుకోవచ్చు. వీరికి డబ్బులు సులభంగా పంపించుకునే సౌలభ్యం వుంది. అందుకు గాను ఇతర చాట్‌ యాప్‌లను వాడాల్సిన పనిలేదు. ఫోన్‌పే యాప్‌లో ఉండే చాట్‌ ఫీచర్‌లోనే ఇతరులను డబ్బులు కావాలని అడగవచ్చు. అందులోనే ఇతరులతో చాట్‌ చేయవచ్చు.

కాగా.. త్వరలోనే గ్రూప్‌ చాట్‌ ఫీచర్‌ను కూడా ఫోన్‌పే అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఒక గ్రూప్‌లో ఉండే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒకరికొకరు చాట్‌ చేస్తూ సులభంగా డబ్బులు పంపుకోవచ్చు, లేదా డబ్బులు కావాలని రిక్వెస్ట్‌ పెట్టుకోవచ్చు. ఈ కొత్త చాట్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై ఫోన్‌పే వాడుతున్న వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని ద్వారా ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని ఫోన్ పే పేర్కొంది.

Published On - 11:25 pm, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu