ఏపీ, తెలంగాణలకు నూతన చీఫ్ జస్టిస్‌లు, ప్రస్తుత చీఫ్‌లు ఆ రాష్ట్రాలకు బదిలీ..కొత్తవారి వివరాలు ఇవే..

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్‌లు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‍గా అరూప్ గోస్వామి నియమితులయ్యారు. 

ఏపీ, తెలంగాణలకు నూతన చీఫ్ జస్టిస్‌లు, ప్రస్తుత చీఫ్‌లు ఆ రాష్ట్రాలకు బదిలీ..కొత్తవారి వివరాలు ఇవే..

Updated on: Dec 15, 2020 | 6:05 PM

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్‌లు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‍గా అరూప్ గోస్వామి నియమితులయ్యారు. ఇప్పటివరకు సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‍గా గోస్వామి సేవలందించారు. ఇప్పటివరకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించిన మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు.  తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‍గా హిమా కోహ్లీ నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న హిమా కోహ్లీకి..తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి లభించింది. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా వ్యవహరించిన చౌహన్ ఉత్తరాఖండ్‍కు బదిలీ అయ్యారు. మరోవైపు ఒరిస్సా హైకోర్టు చీఫ్‌గా జస్టిస్ మురళిధర్ నియమితులయ్యారు.

Also Read :

ప్రిన్సిపాల్ గారూ..! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..పిల్లల ముందు చేసేది ఇలాంటి పనులేనా?

55 అడుగుల కొబ్బరి చెట్టుపై అచేతనంగా పడి ఉన్న వ్యక్తి..స్థానికులు సమాచారంతో స్పాట్‌కు పోలీసులు..ట్విస్ట్ ఏంటంటే