మోదీని కలవనున్న ఎన్డీయే పక్షాలు..

మోదీని లోక్‌సభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సమావేశం కానున్నారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీ ముందే ఖరారు కావడంతో లాంఛనప్రాయంగానే ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అంతకుముందు పార్లమెంట్ హౌస్‌లో బీజేపీ ఎంపీలు భేటీ కానున్నారు. ఈ నెల 30న ప్రధానిగా మోదీ సహా కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నారు. ఈ నెల 28న మోదీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:55 am, Sat, 25 May 19
మోదీని కలవనున్న ఎన్డీయే పక్షాలు..

మోదీని లోక్‌సభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సమావేశం కానున్నారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీ ముందే ఖరారు కావడంతో లాంఛనప్రాయంగానే ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అంతకుముందు పార్లమెంట్ హౌస్‌లో బీజేపీ ఎంపీలు భేటీ కానున్నారు. ఈ నెల 30న ప్రధానిగా మోదీ సహా కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నారు. ఈ నెల 28న మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిని సందర్శించనున్నారు. 29న సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు వెళ్తారు. అక్కడ తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకుంటారు.

కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మోదీ సహా ఇతర నేతలు రాష్ట్రపతిని కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. వీటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఈ నెల 30నే కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరే సూచనలు కన్పిస్తున్నాయి. జూన్ 3వ తేదీలోగా 17 లోక్‌సభ కొలువుదీరాల్సి ఉంది. ముగ్గురు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిని కలిసి కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేస్తే.. కొత్త సభ ఏర్పాటు మొదలవుతుంది.