NBCC Recruitment 2021: ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు వేత‌నం పొందొచ్చు..

|

Jun 05, 2021 | 3:53 PM

NBCC Recruitment 2021: నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్స‌క్ట్ర‌ష‌న్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. న్యూఢిల్లీలోని భార‌త ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ...

NBCC Recruitment 2021: ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు వేత‌నం పొందొచ్చు..
Nbcc Jobs
Follow us on

NBCC Recruitment 2021: నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్స‌క్ట్ర‌ష‌న్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. న్యూఢిల్లీలోని భార‌త ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ‌లో ప‌లు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 07 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(హెచ్‌ఆర్‌ఎం)–05, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌–02 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* మేనేజ్‌మెంట్ ట్రెయినీ(హెచ్‌ఆర్‌ఎం) ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. దరఖాస్తు చివరి తేదీ నాటికి 29 ఏళ్లు మించకూడ‌దు.

* జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. దరఖాస్తు చివరి తేది నాటికి 27ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* మేనేజ్‌మెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ. 1,40,000 వేత‌నంగా చెల్లిసారు.

* జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.24,640 వేతనంగా చెల్లిస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదిగా 21.06.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Buckingham Canal: శతాబ్ధాల చరిత్ర.. దశాబ్ధాల నిర్లక్ష్యం.. వెరసి జలరవాణాకు బ్రేక్

Siraj complaint on Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై మహ్మద్ సిరాజ్ ఫిర్యాదు.. వీడియో విడుదల చేసిన బీసీసీఐ..

Anandaiah Medicine: ఆనందయ్య మందుకు బ్రేక్.. పొలిటికల్ వివాదంలో తయారీ ప్రక్రియ.. సోమవారం నుంచి పంపిణీ డౌటే!