గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడో రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అమ్మవారు శ్రీగాయత్రీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామునుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతులు కల్పిస్తున్నారు అధికారులు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. మరోవైపు శ్రీశైలంలోనూ దసరా ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. ఇక తెలంగాణలోని వరంగల్‌ శ్రీభద్రకాళి ఆలయంలో దేవీ […]

గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

Edited By:

Updated on: Oct 01, 2019 | 10:17 AM

తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడో రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అమ్మవారు శ్రీగాయత్రీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామునుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతులు కల్పిస్తున్నారు అధికారులు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. మరోవైపు శ్రీశైలంలోనూ దసరా ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి.

ఇక తెలంగాణలోని వరంగల్‌ శ్రీభద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం, బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో కూడా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

శ్రీగాయత్రీదేవి అమ్మవారు..

సకల వేద స్వరూపం శ్రీగాయత్రీ దేవి అమ్మవారు. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెబుతారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.

ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతఃకాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజోవంతము అవుతుంది. గాయత్రీ మంత్ర జపము చేస్తే చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.

గాయత్రీ మంత్రం..

‘‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌”