Quality of Life: ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఈ ఏడుగురు ఖచ్చితంగా ఉండాలి.. అప్పుడే జీవితం రంగులమయం..

ఈ రోజుల్లో వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకు జీవనశైలితో ముడిపడి ఉంటోంది. గజిబిజీ వర్కింగ్‌ అవర్స్‌, నైటు షిఫ్టులు, వర్క్‌ ఫ్రం హోం.. కారణాలతో ప్రతి ఒక్కరూ జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. దీంతో శారీరకంగానేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా చెడిపోతోంది..

Quality of Life: ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఈ ఏడుగురు ఖచ్చితంగా ఉండాలి.. అప్పుడే జీవితం రంగులమయం..
Quality Life

Updated on: Jul 25, 2022 | 9:15 PM

National Junk Food Day 2022: ఈ రోజుల్లో వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకు జీవనశైలితో ముడిపడి ఉంటోంది. గజిబిజీ వర్కింగ్‌ అవర్స్‌, నైటు షిఫ్టులు, వర్క్‌ ఫ్రం హోం.. కారణాలతో ప్రతి ఒక్కరూ జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. దీంతో శారీరకంగానేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా చెడిపోతోంది. ఈ రోజు జాతీయ జంక్ ఫుడ్ డే. ఈ సందర్భంగా ఇంట్లో ఉంటూనే సులువైన పద్ధతుల్లో ఆరోగ్యంగా ఏ విధంగా ఉండొచ్చో లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ సాహిల్ కొఠారి చెబుతున్న మార్గాలు మీకోసం..

సాహిల్.. మన జీవితంలో ఏడుగురు అతి ముఖ్యమైన వైద్యులు ఖచ్చితంగా ఉండాలి. ఎవరెవరంటే.. ఉదయ కాలపు సూర్యకాంతి, 6-7 గంటల మంచి నిద్ర, తగినంత నీరు, ఆత్మవిశ్వాసం, శాఖాహారం తినడం, వారానికి కనీసం 5 రోజులు పని చేయడం, మంచి ఫ్రెండ్స్‌ కలిగి ఉండటం.

మార్నింగ్ సన్ లైట్
ఉదయాన్నే వెలువడే సూర్యకిరణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే లేలేత కిరణాల్లో విటమిన్‌ ‘డి’ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే కనీసం 30 నిమిషాలపాటు ఎండలో ఉంటే మంచిది.

ఇవి కూడా చదవండి

Good Sleeping

గుడ్‌ స్లీపింగ్
ప్రతి ఒక్కరికీ రోజుకు కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర అవసరం. కంటి నిండా నిద్రపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడమేకాకుండా, రోజువారీ పనిలో కూడా ఎక్కువ శ్రద్ధకనబరుస్తారు.

నీళ్లు తగినంత తాగాలి
నీళ్లు అధికంగా తాగడం వల్ల శరీరంలోని హానికరక మలినాలు చెమట, మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసుడు నీళ్లు త్రాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టవచ్చు.

శాఖాహారం
శాకాహార ఆహారంలో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే శాకాహారులకు రక్తపోటు, హార్ట్‌ ఎటాక్‌ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. మరో ముఖ్యవిషయం ఏంటంటే.. శాఖాహారం చాలా సులువుగా జీర్ణమవుతుంది. శాకాహారం.. మన ఆరోగ్యానికేకాదు పర్యావరణానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది

రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌
రోజూ క్రమం తప్పకుండా చిన్నపాటి ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల మెటబాలిజం మెరుగుపరచడంతో పాటు, అనవసర కేలరీలు కూడా వేగంగా కరిగిపోతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. స్ట్రెస్‌, తలనొప్పి, డిప్రెషన్ వంటి అనేక మానసిక సమస్యలకు కూడా చెక్‌ పెట్టవచ్చు.

Friends

గుడ్‌ ఫ్రెండ్స్‌
మన మెదడులో పాజిటివ్‌ ఆలోచనలను రేకెత్తించే ఎండార్ఫిన్ అనే రసాయనాలు ఉంటాయి. మనకిష్టమైన స్నేహితులతో గడిపినప్పుడు ఎండార్ఫిన్లు ప్రేరేపించబడతాయి. అంతేకాకుండా మంచి ఫ్రెండ్స్‌ ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

ఆత్మవిశ్వాసం
జీవితంలో ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు సాగాలంటే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ ఖచ్చితంగా కావాలి. ఆత్మ విశ్వాసం నిండుగా ఉంటే జీవన పయనం కూడా సక్రమంగా ఉంటుంది. లేదంటే ఇబ్బందుల్లో చిక్కుకోవల్సి వస్తుంది. ఇతరుల నిర్ణయాలపై ఆధారపడకుండా స్వంతంగా ఆలోచించడం నేర్చుకోవాలి. బుద్ధుడు కూడా అదే చెప్పాడు.. ‘Be your own light’