దేశంలో కొత్తగా 19,079 మందికి కరోనా పాజిటివ్.. 99 లక్షలు దాటిన కోలుకున్నవారి సంఖ్య

|

Jan 02, 2021 | 12:11 PM

దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

దేశంలో కొత్తగా 19,079 మందికి కరోనా పాజిటివ్.. 99 లక్షలు దాటిన కోలుకున్నవారి సంఖ్య
Corona-Virus-India
Follow us on

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులకు బ్రిటన్ నుంచి వ్యాప్తి చెందుతున్న కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ తోడవడంతో మరోసారి కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 19,079 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 224 మంది కోవిడ్ బారినపడి మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,49,218కి చేరాయి.

కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య ఒక కోటీ 3 లక్షల 5 వేల 788కి చేరుకుంది. ఇక, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 99 లక్షల 6 వేల 387 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 22,926 మంది కోలుకు డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంకా 2,50,183 మంది వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఐసీఎంఆర్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో గడచిన 24 గంటల్లో 8,29,964 కరోనా టెస్టులు జరిగాయి.