డ్రగ్స్ కొంటూ దొరికిపోయిన టీవీ నటి

ముంబైలో డ్రగ్స్‌ పెడ్లర్లపై ఎన్‌సీబీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహాన్‌ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్ట్‌ చేసింది. పలు టీవీ సీరియళ్లలో నటించారు ప్రీతికా. ఆమె నివాసంలో ఎన్‌సీబీ అధికారులు సోదాలు చేశారు . గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రీతికాతో పాటు ఆమెకు...

డ్రగ్స్ కొంటూ దొరికిపోయిన టీవీ నటి

Updated on: Oct 25, 2020 | 8:53 PM

ముంబైలో డ్రగ్స్‌ పెడ్లర్లపై ఎన్‌సీబీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహాన్‌ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్ట్‌ చేసింది. పలు టీవీ సీరియళ్లలో నటించారు ప్రీతికా. ఆమె నివాసంలో ఎన్‌సీబీ అధికారులు సోదాలు చేశారు . గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రీతికాతో పాటు ఆమెకు గంజాయిని విక్రయించిన పెడ్లర్‌ను కోర్టులో హాజరు పర్చారు ఎన్సీబీ అధికారులు. న్యాయస్థానం ఇద్దరికి నవంబర్‌ 8 వరకు కస్టడీకి తరలించారు.

సావథాన్‌ ఇండియా , సీఐడీ , సంకట్‌మోచన్‌ మహాబలి హనుమాన్‌ లాంటి సీరియళ్లలో నటించారు ప్రీతికా. హిమాచల్‌కు చెందిన ప్రీతికా ఇలా డ్రగ్స్‌ కేసులో ఇరుక్కోవడం సంచలనం రేపుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ సుశాంత్‌ సూసైడ్‌ కేసులో డ్రగ్స్‌ యాంగిల్‌లో విచారణ చేస్తోంది ఎన్సీబీ. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఎన్సీబీ ప్రశ్నించింది.

చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు ఎన్సీబీ లిస్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పక్కా ఆధారాల తోనే స్టార్స్‌ ఇళ్లపై ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.