Nara Lokesh Comments : జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనంతపురంలో దళిత యువతి బలైపోయిందని పేర్కొన్నారు. రక్షించాలని వేడుకుని ఏడ్చి, ఏడ్చి ఓ తల్లి కన్నీళ్లు ఇంకిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. టార్చర్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇళ్లు మారమని ఉచిత సలహా ఇస్తారా అని ఫైరయ్యారు. కూతురు కనబడటం లేదని కంప్లైంట్ చేస్తే ఉదయం చూద్దామని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని దుయ్యబట్టారు. దిశ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే లోకల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోమని చెప్పడం దారుణమన్నారు. కాపాడుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ అసమర్థత కారణంగా చదువులోనూ, స్పోర్ట్స్ లోనూ రాణించిన స్నేహాలత ప్రయాణం అర్దాంతరంగా ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుని, స్నేహలత కుటుంబాన్ని ఆదుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
Also Read :