అమరావతి దిగులుతో మరో రైతు తనువు చాలించాడు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు హార్ట్ అటాక్‌తో మరణించినట్టు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకున్న తక్కువ పోలంలోనే అర ఎకరం రాజధాని నిమిత్తం ఇచ్చినట్టు సమాచారం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత నాలుగు రోజులుగా జరుగుతోన్న ఆందోళనల్లో ఆయన చురుకుగా పాల్గొంటన్నట్టు తెలుస్తోంది.
కాగా రైతు మరణంపై మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోందని ట్వీట్ చేశారు. జగన్ గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రైతులను అవమనిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయని, మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధానిపై ప్రభుత్వం పునరాలోచించడం మంచిదని హితబోధ చేశారు.
వైకాపా నాయకులు రైతులను అవమనిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధాని పై ప్రభుత్వం పునరాలోచించడం మంచిది. (2/2)
— Lokesh Nara (@naralokesh) January 8, 2020