Namrata Shirodkar: దుబాయ్‌లో నమ్రత పుట్టిన రోజు వేడుకలు… ఎంజాయ్‌ చేస్తున్న ప్రిన్స్‌ ఫ్యామిలీ…

Namrata Shirodkar B.Day Photos: ప్రస్తుతం టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌బాబు కుటుంభసభ్యులతో కలిసి దుబాయ్‌లో సంతోషంగా గడుపుతున్నారు. మహేష్‌ ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్‌ కోసం కుటుంబంతో కలిసి..

Namrata Shirodkar: దుబాయ్‌లో నమ్రత పుట్టిన రోజు వేడుకలు... ఎంజాయ్‌ చేస్తున్న ప్రిన్స్‌ ఫ్యామిలీ...

Updated on: Jan 24, 2021 | 4:55 PM

Namrata Shirodkar B.Day Photos: ప్రస్తుతం టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌బాబు కుటుంభసభ్యులతో కలిసి దుబాయ్‌లో సంతోషంగా గడుపుతున్నారు. మహేష్‌ ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌ కోసం కుటుంబంతో కలిసి దుబాయ్‌ చేరుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మహేష్‌ సతీమణి నమ్రత పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా దుబాయ్‌లోనే నమ్రత బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మహేష్‌ పిల్లలతో పాటు మరికొంత మంది స్నేహితులు హాజరయ్యారు.

 

నమ్రత తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తోన్న సమయంలో తీసిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘వచ్చే ఏడాది కూడా సంతోషంగా గడవాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ప్రోత్సహించే వారినే మీ చుట్టూ ఉండేలా చూసుకోండి’ అంటూ క్యాప్షన్‌ జోడించారు.

ఇక నమ్రత పుట్టిన రోజు సందర్భంగా మ‌హేష్ బాబు తండ్రి కృష్ణ సొంతూరైన బుర్రిపాలెంలో ఒక  కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. మెడిక‌ల్ క్యాంప్‌ని ఏర్పాటు చేసి 135 మంది గ్రామ‌స్థుల‌కు ఉచిత ప‌రీక్ష‌లు చేశారు. ఆంధ్ర హాస్పిట‌ల్స్‌లో భాగ‌స్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంద‌ని.. ఐదేళ్ల‌లో ఇది 29వ హెల్త్ క్యాంప్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Also Read: Akhil Akkineni: ముంబై భామతో రొమాన్స్ చేయనున్న అక్కినేని హీరో.. సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా..