Nails Shows Your Health : మన చేతి గోర్లు తీరును బట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు అంటున్న నిపుణులు

| Edited By: Pardhasaradhi Peri

Jan 26, 2021 | 7:37 AM

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట.. కానీ ఏ ఇద్దరిలోనూ కనుపాపలు, వేలి ముద్రలతో పాటు... చేతి గోర్లు కూడా ఒకేలా ఉండవు.. చేతి గోర్లు కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా..

Nails Shows Your Health : మన చేతి గోర్లు తీరును బట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు అంటున్న నిపుణులు
Follow us on

Nails Shows Your Health : ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట.. కానీ ఏ ఇద్దరిలోనూ కనుపాపలు, వేలి ముద్రలతో పాటు… చేతి గోర్లు కూడా ఒకేలా ఉండవు.. చేతి గోర్లు కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయని.. మన చేతి గోర్ల తీరుని బట్టి మనలో ఉన్న లోపాలను తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

కొందరి చేతి వేలి గోర్లపై అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది.. ఈ సెమీ సర్కిల్ ను లునులా అంటారు. లునులా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూన్ అని అర్ధం.. కాగా గోరు మీద ఉండే ఈ లునులా ని చాలామంది సర్వసాధారణంగా పట్టించుకోరు.. కానీ ఈ లునులా మన శరీరంలో ఉన్న అత్యంత సున్నిత మైన భాగాల్లో ఒకటి.. ఈ లునులా దెబ్బతింటే గోరు పెరగడం ఆగిపోతుంది అట. గోరు రంగును బట్టి మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలను కూడా తెలుసుకోవచ్చట..

*చేతి గోర్లపై లునులా లేకపోతే.. వారిలో రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని అర్ధం…
*లునులా మీద ఎరుపు, పసుపు రంగులో మచ్చలు ఉంటే వారికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు గుర్తించ వచ్చట..
* లునులా ఆకారం మరీ చిన్నగా గుర్తు పట్టలేనట్లు గా ఉంటే.. వారు అజీర్తి వ్యాధితో బాధపడుతున్నారని.. వారి శరీరంలో విష, వ్యర్ధ పదార్ధాలు ఉన్నాయని తెలుసుకోవచ్చట…
* లునులా రంగు నీలం లేదా పూర్తి స్థాయిలో తెలుపు ఉంటే వారు త్వరలో షుగర్ వ్యాధి బాధితులు కాబోతున్నారని అర్ధం చేసుకోవాలి…
మన ఆరోగ్యం గురించి తెలిపే గోరు.. లునులా ని నిర్లక్షం చేయకుండా ఒక్క సారి.. మన చేతి గోర్ల ను గమనించి .. తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: క్లైమాక్స్ అటూ ఇటూ అయితే ఫ్యాన్స్ బస్సులు, లారీలు వేసుకుని వచ్చేస్తారంటున్న డాక్టర్ బాబు