కళతప్పిన చెంచులక్ష్మి మ్యూజియం – శిథిలమవుతున్న అనవాళ్లు..!

ప్రకృతి అందాల నడుమ ఆడవి బిడ్డల జీవన విధానం ప్రతిబింభించేలా శ్రీశైలం ఆడవుల్లో మ్యూజియంను ఏర్పాటు చేసింది సర్కార్. చెంచుల జీవన శైలి ఉట్టిపడేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. నాగరికతకు అద్ధంపట్టే ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం అలనా పాలనా కరువై మూతపడింది. ‌నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కనున్న మన్ననూర్‌లో సుమారు రూ.50లక్షలు వెచ్చించి 2009లో చెంచులక్ష్మి మ్యూజియం నిర్మించారు. మూడెకరాల విస్తీర్ణంలో చెంచుల జీవన శైలి ఉట్టిపడేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. కొండపై […]

కళతప్పిన చెంచులక్ష్మి మ్యూజియం - శిథిలమవుతున్న అనవాళ్లు..!
Follow us

|

Updated on: May 28, 2020 | 3:17 PM

ప్రకృతి అందాల నడుమ ఆడవి బిడ్డల జీవన విధానం ప్రతిబింభించేలా శ్రీశైలం ఆడవుల్లో మ్యూజియంను ఏర్పాటు చేసింది సర్కార్. చెంచుల జీవన శైలి ఉట్టిపడేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. నాగరికతకు అద్ధంపట్టే ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం అలనా పాలనా కరువై మూతపడింది. ‌నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కనున్న మన్ననూర్‌లో సుమారు రూ.50లక్షలు వెచ్చించి 2009లో చెంచులక్ష్మి మ్యూజియం నిర్మించారు. మూడెకరాల విస్తీర్ణంలో చెంచుల జీవన శైలి ఉట్టిపడేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. కొండపై నుంచి తాళ్లతో వేలాడుతూ తేనెను తీసే తీరు. వంట పాత్రలు, అడవిలో నిప్పు పుట్టించేందుకు రాపిడి చేసే విధానం, అడవి జంతువుల వేట, చెంచుల కుటుంబ జీవనం, చెట్టూ చేమలు తదితర ప్రతిమలను ఇక్కడ ఏర్పాటు చేశారు. చెంచులక్ష్మి మ్యూజియంతోపాటు, రెస్టారెంట్‌ను విశాలమైన స్థలంలో పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా రూపొందించారు. వీటిని చూస్తే చెంచుల జీవన విధానం, అడవి వాతావరణం బోధపడుతోంది. మ్యూజియంను చూసినంత సేపు ప్రస్తుత పరిస్థితులు మరిచిపోయాలే ఆ అందాలు కట్టిపడేస్తాయి. ఏకంగా చెంచులతో సావాసం చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. శ్రీశైలం వెళ్లివారికి మంచి టూరిజం స్పాట్ గా ఉంది. చెంచులక్ష్మి మ్యూజియం నిర్వహణ లోపించడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో మ్యూజియంతోపాటు నిర్మించిన రెస్టారెంట్‌ కూడా మూతపడింది. ప్రస్తుతం అనవాలు లేకుండా మ్యూజియం కుప్పకూలుతోంది. మ్యూజియం, రెస్టారెంట్‌ తిరిగి ప్రారంభమైతే స్థానిక చెంచులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతయి. పర్యాటకుల తాకిడి అటు ప్రభుత్వానికి ఇటు స్థానికులకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయంటున్నారు గిరిజనులు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని మ్యూజియంను పునరుద్ధరించాలని చెంచులు కోరుతున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!