యూట్యూబ్‌లో అద్భుతమైన ఫీచర్.. ‘బెడ్‌‌టైమ్ రిమైండర్’

గత కొంతకాలంగా లాక్‌డౌన్‌‌తో జనమంతా ఇంటికే పరిమితమైపోయారు. దీంతో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువగా పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇప్పుడు జనం ఫోన్‌లకి ఎడిక్ట్ అయిపోయారనే చెప్పాలి. వీడియో స్ట్రీమింగ్‌‌ల రేటు చాలా వరకూ పెరిగిపోయింది. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్, సినిమాలు, పలు షోలు చూస్తూ..

యూట్యూబ్‌లో అద్భుతమైన ఫీచర్.. 'బెడ్‌‌టైమ్ రిమైండర్'
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 3:39 PM

గత కొంతకాలంగా లాక్‌డౌన్‌‌తో జనమంతా ఇంటికే పరిమితమైపోయారు. దీంతో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువగా పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇప్పుడు జనం ఫోన్‌లకి ఎడిక్ట్ అయిపోయారనే చెప్పాలి. వీడియో స్ట్రీమింగ్‌‌ల రేటు చాలా వరకూ పెరిగిపోయింది. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్, సినిమాలు, పలు షోలు చూస్తూ ఎప్పుడు నిద్రిస్తున్నారో, ఎప్పుడు లేస్తున్నారో కూడా తెలీని పరిస్థితి నెలకొంది. అందుకే యూట్యూబ్‌ మీ నిద్రకి ఆటంకం కలిగించకూడదనుకుంటుంది. ఈ క్రమంలో ఓ సరికొత్త ఫీచర్‌ని ప్రవేశ పెట్టింది యూట్యూబ్. అదే ‘బెడ్‌టైమ్ రిమైండర్’.

దీంతో మీరు నిద్రించాలనుకున్న సమయాన్ని ముందే యూట్యూబ్‌కి చెబితే చాలు. ఆ సమయంలో అది మీకు రిమైండ్ చేస్తుంది. దీన్ని ఏవిధంగా సెట్ చేసుకోవాలంటే.. యూట్యూబ్‌ సెట్టింగ్స్‌లో స్టార్ట్, ఎండ్ టైమ్‌లను సెట్ చేసుకోవాలి. ఎండ్ సమయానికి చూస్తున్న వీడియో కాస్త ఉండిపోతే ‘వెయిట్ అంటిల్ ద వీడియో ఈజ్ ఓవర్’ ఆప్షన్‌ని క్లిక్ చేయొచ్చు. అంతేకాదు రిమైండర్‌ని స్నూజ్ చేయొచ్చు.. అలాగే డిస్‌మిస్‌ కూడా చేసుకోవచ్చు.

Read More:

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!