నాగాలాండ్ మంత్రి సీఎం చాంగ్ కన్నుమూత

నాగాలాండ్‌ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి సీఎం చాంగ్‌ సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆరోగ్యంతో చికిత్స పొందుతన్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.

నాగాలాండ్ మంత్రి సీఎం చాంగ్ కన్నుమూత

Edited By:

Updated on: Oct 12, 2020 | 5:55 PM

నాగాలాండ్‌ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి సీఎం చాంగ్‌ సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆరోగ్యంతో చికిత్స పొందుతన్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన కరోనాతో మరణించారా లేదా అన్నది స్పష్టం కాలేదు. చాంగ్ ఏప్రిల్ 01, 1942 న నాగాలాండ్ లోని తున్సాంగ్ జిల్లా పరిధిలోని నోక్సేన్ గ్రామంలో జన్మించాడు. నోక్సేన్ (ట్యూన్సాంగ్) నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన 78 ఏండ్ల చాంగ్‌ మాజీ ఐఏఎస్‌ అధికారిగా కూడా పనిచేశారు. 2002 లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి..2003 లో తన మొదటి ఎన్ఎల్ఏ సార్వత్రిక ఎన్నికలలో పోటీ పడ్డాడు.

2009 ఎన్నికల్లో నాగాలాండ్ లోక్ సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు..2018 నుంచి నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)లో ఉన్న ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ, వాతావరణం, న్యాయ శాఖల మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాగాలాండ్‌ సీఎం సలహాదారుడైన అబు మెహతా మంత్రి చాంగ్‌ మరణం గురించి ట్విట్టర్‌లో తెలిపారు. ప్రభుత్వానికి తీరని లోటని అన్నారు. నాగాలాండ్ ఎంపీ తోఖేహో యెప్తోమి కూడా చాంగ్‌ మరణం పట్ల సంతాపం తెలిపారు.