AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ ప్రారంభమైన లవ్ స్టొరీ షూటింగ్..

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన టాలీవుడ్ సినిమా షూటింగులన్నీ కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. తాజాగా అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల...

మళ్లీ ప్రారంభమైన లవ్ స్టొరీ షూటింగ్..
Ravi Kiran
|

Updated on: Sep 07, 2020 | 8:46 PM

Share

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన టాలీవుడ్ సినిమా షూటింగులన్నీ కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. తాజాగా అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ షురూ అయింది. కోవిడ్ నిబంధనలకు లోబడి చిత్ర యూనిట్ అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. (Love Story Shooting Resume)

కేవలం 15 మంది యూనిట్ సభ్యులతో సినిమా షూటింగ్ మొదలు కాగా.. షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఎవరూ కూడా సెట్ విడిచి వెళ్లకూడదనే అనే నిబంధనను పెట్టారని సమాచారం. సెట్స్‌లో సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరి చేశారు. కాగా, సింగల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట.

Also Read:

 ఏపీ: సచివాలయాల్లో సేవా రుసుములు పెంపు.!

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..

Follow Us